Uncategorized
Trending

భూలక్ష్మి నగర్‌లో ఘనంగా సత్సంగం – శ్రీరామ ఉత్సవం నిర్వహణ

ఈ రోజు భూలక్ష్మి నగర్, వనస్థలిపురంలో శ్రీరామ భక్తుల ఆధ్వర్యంలో సత్సంగం మరియు శ్రీరామ ఉత్సవ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామ నామస్మరణ, భజనలు, ధార్మిక ప్రవచనాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
ఈ సందర్భంగా శ్రీరాముని మహిమ, ధర్మం యొక్క ప్రాముఖ్యత, భారతీయ సంస్కృతి పరిరక్షణ వంటి అంశాలపై వక్తలు భక్తులకు మార్గదర్శకత్వం ఇచ్చారు. కార్యక్రమం మొత్తం భక్తి భావంతో కొనసాగి, చివరగా శ్రీరాముని జైజయకారాలతో ముగిసింది.
భక్తులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
జై శ్రీరామ్
వనస్థలిపురం ప్రఖండ్
వివేకానంద జిల్లా
విశ్వ హిందూ పరిషత్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *