దీర్ఘాకాలికంగా పెండింగ్ లో ఉన్న ఏన్.జి.ఓస్.కాలనీ గ్రంథాలయం పనులు రేపటి నుండి ప్రారంభం….ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు.

ఈ రోజు ఏన్.జి.ఓస్.కాలనీపెద్దలు మరియు కాలనీవాసులందరు కలిసి లైబ్రరీ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా కాలనీవాసులు అందరు గ్రంధాలయం పనులు వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది.స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు గ్రంధాలయం పనులు తాను ఎప్పుడు ఆపలేదని కొందరు బి.జె.పి.కార్పొరేటర్ల దుందుడుకు చర్యల కారణంగా పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే గారు తెలిపారు.గ్రంధాలయం పనులు రేపటి నుండి ప్రారంభించాలని అక్కడే ఉన్న గ్రంథలయం ఈ.ఈ.మరియు డి.ఈ.గార్లను అదేశించడం జరిగింది.రేపటి నుండి గ్రంధాలయం పనులు ప్రారంభం కానుండడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్బంగా కాలనీ పెద్దలందరు ఎమ్మెల్యే శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని మరియు బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి గారిని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్జీవోస్ కాలనీపెద్దలు సోమయాజులు,పంపన్న వెంకటేశ్వర,శివనాగేశ్వర్ రావు,వేముల జైపాల్ రెడ్డి,వర్ధని,శశిధర్ రెడ్డి,ఓంప్రకేష్,భూషణ్,విశ్వనాథం,శ్యాంకుమార్,ఆనంద్ ఎన్జీవోస్ కాలనీపెద్దలు,చుట్టుపక్కల కాలనీపెద్దలు మరియు భారస నాయకులు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అనిల్ చౌదరీ,యూత్ అధ్యక్షులు మునగాల రాఘవేందర్ రావు,కొంగర మహేష్,నీళ్ల రాజశేఖర్ గౌడ్,నరేందర్ గౌడ్,శ్రీకాంత్ రెడ్డి,అమర్థ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












