
భూలక్ష్మీ నగర్ కమ్యూనిటీ హాల్లో భూలక్ష్మీ నగర్ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు మహావాది విజయ ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో తొలిరోజైన ఎంగిలిపూల బతుకమ్మకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా మహిళలు ముందురోజే వివిధ రకాల పూలను సేకరించి, పెత్రమాసి అమావాస్య రోజున రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆటపాటలతో వేడుకలను జరుపుకున్నారు. ఎంగిలిపూల బతుకమ్మ నైవేద్యంగా పప్పు, బెల్లం సమర్పించడం ఆనవాయితీ.
మహిళలంతా ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడుతూ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.












